- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శోభన్ బాబు ‘సోగ్గాడు’.. స్వర్ణోత్సవ వేడుకలు
నటభూషణ్ శోభన్ బాబు నటించిన 'సోగ్గాడు' చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్లను హోరెత్తించి. అనేక రికార్డులను సొంతం చేసుకుంది. పల్లెటూరు నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంతోనే శోభన్ బాబు 'సోగ్గాడు' అయిపోయాడు. జయ చిత్ర, జయ సుధ హీరోయిన్లుగా కె.బాపయ్య దర్శకత్వంలో

దిశ, సినిమా : నటభూషణ్ శోభన్ బాబు నటించిన 'సోగ్గాడు' చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్లను హోరెత్తించి. అనేక రికార్డులను సొంతం చేసుకుంది. పల్లెటూరు నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంతోనే శోభన్ బాబు 'సోగ్గాడు' అయిపోయాడు. జయ చిత్ర, జయ సుధ హీరోయిన్లుగా కె.బాపయ్య దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రం 1975 డిసెంబర్ 19న విడుదలైంది. ఈ ఏడాది డిసెంబర్ 19 నాటికి 50 ఏళ్లు పూర్తిచేసుకుని స్వర్ణోత్సవం జరుపుకోనున్నది. ఈ నేపథ్యంలో సురేష్ ప్రొడక్షన్స్, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి సంయుక్తంగా శ్రేయాస్ మీడియా సౌజన్యంతో డిసెంబర్ 19న హైదరాబాద్‌లో స్వర్ణోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించనున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను రామానాయుడు స్టూడియోలో విడుదల చేశారు. శోభన్ బాబుతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు, సీనియర్ దర్శకుడు కె. మురళీ మోహన రావు, మరో సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు, సీనియర్ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






