- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, సినిమా: మధుర ఎంటర్‌టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సంతాన ప్రాప్తిరస్తు’(Santhana Prapthirasthu). విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న ఈ సినిమాకు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. నవంబర్ 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘తెలుసా నీకోసమే’ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ప్రొడ్యూసర్ సురేష్ బాబు.. సాంగ్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి శుభకాంక్షలు తెలుపారు.
ఈ సందర్భంగా హీరో విక్రాంత్ మాట్లాడుతూ.. ‘‘సంతాన ప్రాప్తిరస్తు’ కథ విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ కథలో నేడు సొసైటీ ఎదుర్కొంటున్న ఒక బర్నింగ్ ఇష్యూను ఎలాంటి మెసేజ్‌లు ఇవ్వకుండా లైట్ హార్టెట్‌గా స్క్రిప్ట్ చేశారు. పిల్లలు పుట్టిన యంగ్ కపుల్స్ సొసైటీ నుంచి ఒక ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇది వారిని మానసికంగా ఇబ్బందిపెడుతుంది. అలాంటి ఎమోషనల్ కంటెంట్ కూడా ఈ మూవీలో ఉంది. ఈ సినిమాలో నా పర్‌ఫార్మెన్స్ కు పేరొస్తే దానికి కారణం మా దర్శకుడు సంజీవ్ రెడ్డి. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన మా ప్రొడ్యూసర్స్ శ్రీధర్‌కు, హరిప్రసాద్‌కు థ్యాంక్స్. అజయ్ అరసాడ తన బీజీఎంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. నా ఆల్ టైమ్ ఫేవరేట్ సాంగ్ తెలుసా నీ కోసమే. చాందినీ పర్‌ఫార్మెన్స్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా ఫ్యామిలీ వ్యాల్యూస్ చెబుతుంది. కాబట్టి అందరూ కలిసి చూడొచ్చు. నవంబర్ 14న థియేటర్స్‌లోకి వస్తున్న మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం’ అని తెలిపారు.






