- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
sobhita: ఇంట్రెస్టింగ్ వీడియో పంచుకున్న అక్కినేని కోడలు శోభితా ధూళిపాళ్ల
అక్కినేని హీరో నాగ చైతన్య (Naga Chaitanya) అండ్ భార్య శోభితా ధూళిపాళ్ల (sobhita) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని హీరో నాగ చైతన్య (Naga Chaitanya) అండ్ భార్య శోభితా ధూళిపాళ్ల (sobhita) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. వీరిద్దరు ఇరుకుంబీకుల సభ్యుల నడుమ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది (2024) లో ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లికి ముందే ఈ కపుల్ ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియా టాక్. వీరై పెళ్లైన కొద్ది రోజులకే అన్యోన్య దంపతులుగా పేరు సంపాదించుకుంటున్నారు. ప్రస్తుతం శోభితా అక్కినేని ఇంట్లో కోడలిగా తన బాధ్యతలు స్వీకరిస్తుంది. ఉత్తమ కోడలిగా పేరు సంపాదించుకుంటుంది.
ఇకపోతే శోభితా తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ అభిమానుల్ని అలరిస్తుంటుంది. రీసెంట్‌గా నాగ చైతన్య శోభితా ధూళిపాళ్ల హైదరాబాదు (Hyderabad)లోని సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్ కేర్ (St. Jude India Child Care) ను వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ క్యాన్సర్ (Cancer) ట్రీట్మెంట్ కోసం వచ్చే పిల్లలతో సరదాగా గడిపారు. వాళ్ల తల్లిదండ్రులతో కూడా ముచ్చటించారు. పిల్లలతో కలిసి చైతన్య డ్యాన్స్ కూడా చేశారు. శోభితా పిల్లలతో అప్యాయంగ మాట్లాడి ధైర్యం చెప్పింది.
అయితే తాజాగా శోభితా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికన ఓ పోస్ట్ పెట్టింది. ‘‘సెల్ఫ్ కేర్ రిట్రీట్ యొక్క ప్యానెల్ చర్చలో పాల్గొని, అత్యంత ఓదార్పునిచ్చే మూలికా కషాయాలను తాగుతూ సరదాగా గడిపిన సమయం’’. అంటూ ఓ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం అక్కినేని కోడలు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- Tags
- sobhita






