నడుము అందాలు చూపిస్తూ.. అక్కినేని కోడలు హాట్ షో!

by velandi.Saikiran |

టాలీవుడ్ హీరోయిన్, అక్కినేని కోడలు శోభిత దూళిపాళ్ల (Sobhita Dhulipala) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట్లల

నడుము అందాలు చూపిస్తూ.. అక్కినేని కోడలు హాట్ షో!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరోయిన్, అక్కినేని కోడలు శోభిత దూళిపాళ్ల (Sobhita Dhulipala) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట్లలో మోడలింగ్ చేసిన శోభిత ధూళిపాళ్ల... ఆ తర్వాత 2013లో.. మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొన్నారు. కానీ త్రుటిలో మిస్ ఇండియా కాంపిటీషన్ లో ఓడిపోయారు శోభిత దూళిపాళ్ల.

ఇక అదే సంవత్సరం.. మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో కూడా ఆమె పాల్గొంది. దీంతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది. రామన్ రాఘవ్ 2.0 సినిమాతో నటిగా మారింది ఈ అందాల ముద్దుగుమ్మ శోభిత దూళిపాళ్ల. అలా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎక్కువ సినిమాలు చేసి.. తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అడవి శేషు హీరోగా చేసిన గూఢచారి సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది అక్కినేని కోడలు శోభిత.

ఇక అక్కినేని నాగచైతన్యను (Akkineni Nagachaitanya) పెళ్లి చేసుకున్న తర్వాత... సినిమాలపై దృష్టి పెట్టని శోభిత దూళిపాళ్ల... అందాల ఆరబోత ను మాత్రం ఎక్కడ ఆపడం లేదు. తాజాగా తమిళనాడు వెళ్లిన శోభిత... వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ డ్రెస్ వేసుకొని చాలా క్యూట్ గా కనిపించింది. అక్కడ ఉన్న అందాలను కెమెరాలో బంధిస్తూ... ఫోటోలు కూడా దిగింది శోభిత. దీనికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పెట్టింది. తమిళనాడు అందాలు ఎంజాయ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఇది ఇలా ఉండగా గతేడాది అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకుంది శోభిత దూళిపాళ్ల (Sobhita Dhulipala).

Instagramme Link

Next Story