Sneha Reddy: ఐకాన్‌స్టార్ బర్త్డే సందర్భంగా బ్యూటిఫుల్ వీడియో షేర్ చేసిన స్నేహారెడ్డి.. బన్నీ ఏజ్ విని నోరెళ్లబెడుతోన్న నెటిజన్లు!

by Kodari Anjali |

టాలీవుడ్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Sneha Reddy: ఐకాన్‌స్టార్ బర్త్డే సందర్భంగా బ్యూటిఫుల్ వీడియో షేర్ చేసిన స్నేహారెడ్డి.. బన్నీ ఏజ్ విని నోరెళ్లబెడుతోన్న నెటిజన్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. నేడు ఈ హీరో పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. కాగా ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు అండ్ పలువురు సినీ సెలబ్రిటీలు అల్లు అర్జున్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల్లో బన్నీ స్టేటస్‌లతో హంగామా చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో బన్నీ సతీమణి స్నేహారెడ్డి (Sneha Reddy) కూడా సోషల్ మీడియా వేదిక అయిన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ స్పెషల్ వీడియో పంచుకుని భర్తకు స్పెషల్‌గా విష్ చేసింది.

‘‘నా జీవితంలోని ప్రేమకు 43వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆనందం, శాంతి, అన్నింటికంటే ముఖ్యంగా ఆరోగ్యం & బలంతో నిండిన సంవత్సరంతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను. మీతో కలిసి మీ పక్కన జీవితంలో నడవడానికి ఎప్పటికీ నేను కృతజ్ఞురాలిని. నిన్ను అనంతంగా ప్రేమిస్తున్నాను’’. అంటూ స్నేహారెడ్డి అందమైన వీడియోకు క్యాప్షన్ జోడించింది. ఇక ఈ వీడియోలో అల్లు అర్జున్‌తో కలిసి ఉన్న ఫొటోలను పంచుకుంది. పిల్లలతో కలిసి వెకేషన్స్‌కెళ్లినా పిక్స్, పలు మెమోరీస్ అన్ని జోడించింది. ప్రస్తుతం స్నేహారెడ్డి పంచుకున్న వీడియో సోషల్ మీడియాలోని జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Next Story