- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sneha Reddy: ‘మా చిన్న భోజన ప్రియుడు అయాన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ బ్యూటిపుల్ వీడియో పంచుకున్న స్నేహారెడ్డి
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Iconstar Allu Arjun) కుమారుడు అల్లు అయాన్ (Allu ayan) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Iconstar Allu Arjun) కుమారుడు అల్లు అయాన్ (Allu ayan) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. నేడు(ఏప్రిల్ 3) అయాన్ పుట్టిన రోజు. కాగా ఈ సందర్భంగా తండ్రి అల్లు అర్జున్ అండ్ స్నేహా రెడ్డిలతో పాటు సోషల్ మీడియాలో పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే స్నేహా తాజాగా సోషల్ మీడియా వేదికన అయిన ఇన్‌స్ట్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. అందమైన వీడియో పంచుకుంది. ఇందులో అయాన్‌తో కలిసి ఉన్న కొన్ని అందమైన ఫొటోలను షేర్ చేశారు. ఈ బ్యూటీఫుల్ వీడియోకు స్నేహారెడ్డి ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.
‘‘అత్యంత ముద్దుగా ఉండే అయాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీది అతిపెద్ద హృదయం. వేగవంతమైన పాదాలు కలిగిన మా చిన్ని భోజన ప్రియుడు. కుటుంబ యాత్రను ప్లాన్ చేస్తున్నప్పుడైనా, భోజనం చేస్తున్నప్పుడైనా టేబుల్ చుట్టూ మనందరినీ నవ్విస్తావు. అద్భుతమైన అబ్బాయిని మేము పొందినందుకు చాలా గర్వపడుతున్నాము’’ అంటూ స్నేహారెడ్డి రాసుకొచ్చింది. ఇక అయాన్ తండ్రితో పాటుగా పలు కార్యక్రమాలకు హాజరై.. నెటిజన్లను అలరిస్తుంటాడు. ఇక అయాన్ తండ్రి ఐకాన్‌స్టా అల్లు అర్జున్ ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.






