నేను పార్ట్ టైమ్ యాక్టర్..ఫుల్ టైమ్ పొలిటీషియన్: స్మృతి ఇరానీ

by Ajay Maddhiboyina |

కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను పార్ట్ టైమ్ యాక్టర్, ఫుల్ టైమ్ పొలిటీషియన్ అని చెప్పారు. స్మృతి ఇరానీ ప్ర‌స్తుతం క్యోంకీ సాస్ భీ క‌భీ బ‌హు థీ సీరియ‌ల్ సీక్వెల్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

నేను పార్ట్ టైమ్ యాక్టర్..ఫుల్ టైమ్ పొలిటీషియన్: స్మృతి ఇరానీ
X

దిశ‌, వెబ్ డెస్క్: కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను పార్ట్ టైమ్ యాక్టర్, ఫుల్ టైమ్ పొలిటీషియన్ అని చెప్పారు. స్మృతి ఇరానీ ప్ర‌స్తుతం క్యోంకీ సాస్ భీ క‌భీ బ‌హు థీ సీరియ‌ల్ సీక్వెల్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సీరియ‌ల్ లో తుల‌సి పాత్ర త‌న వ‌ల్ల త‌న‌కు ల‌క్ష‌లాది మంది అభిమానులు అయ్యార‌ని చెప్పారు.

తాను మొద‌టిసారి తుల‌సి పాత్ర‌లో న‌టించిన‌ప్పుడు ఆమె క‌థ ఎంత‌దూరం వెళుతుందో ఊహించ‌లేక‌పోయాన‌న్నారు. తుల‌సి ఒక పాత్ర కాదు అమె ఒక కుమార్తె, త‌ల్లి, స్నేహితురాలు అని చెప్పారు. ఇది కేవ‌లం ఎపిసోడ్ నంబ‌ర్స్ ద్వారా వ‌చ్చిన విజ‌యం కాద‌ని, ప్రేక్ష‌కుల‌ భావోద్యేగాల ద్వారా వ‌చ్చిన విజ‌యం అన్నారు. తుల‌సి అనే పేరు చుట్టూ చ‌ర్చ‌లు, న‌వ్వులు, క‌న్నీళ్లు ప్ర‌వ‌హించాయ‌ని తెలిపారు. తుల‌సి తెర‌కు దూర‌మైనా ప్రేక్ష‌కుల‌ను మాత్రం విడిచిపెట్ట‌లేద‌ని అన్నారు. ఇప్పటికీ కొంత‌మంది త‌న‌ను తుల‌సి అని పిలుస్తుంటార‌ని చెప్పారు.

Next Story