టాలీవుడ్ లో రియ‌ల్‌ కింగ్ దేవ‌ర‌కొండ‌నే...బండ్ల గ‌ణేష్ కు SKN అదిరిపోయే కౌంట‌ర్ !

by velandi.Saikiran |   (  Updated:2025-11-12 19:44:08  IST  )

బండ్ల గణేష్ ను ఉద్దేశించి, నిర్మాత SKN కౌంటర్ ఇచ్చారని పోస్టులు వైరల్ చేస్తున్నారు. బండ్ల గ‌ణేష్ అనే పేరు

SKN (Sreenivasa Kumar)
X

SKN (Sreenivasa Kumar)

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో రియల్ కింగ్ విజయ్ దేవరకొండ అని, ఆయన సైలెంట్ గా ఉంటూనే హిట్లు కొడతారని టాలీవుడ్ నిర్మాత SKN పేర్కొన్నారు. బోనులో ఉన్నా, బయట ఉన్నా అది సింహమే అంటూ విజయ్ దేవరకొండను మెచ్చుకున్నారు. కానీ కొంత మంది ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండను టార్గెట్ చేసి, కించపరిచేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆయనను ఉద్దేశించి సెటైర్లు వేస్తూ బతుకుతున్నారని కూడా బాంబు పేల్చారు.

విజయ్ దేవరకొండ అజ్ఞాతంలో ఉండవచ్చు, కానీ ఆయనకు ఒక్క హిట్టు ప‌డితే ఇండస్ట్రీ షేక్ అవుతుందని తెలిపారు నిర్మాత SKN. అలాంటి విజయ్ దేవరకొండ గురించి మాట్లాడే వాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సక్సెస్ మీట్ లో నిర్మాత SKN ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన విజయ్ దేవరకొండ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. బండ్ల గణేష్ ను ఉద్దేశించి, నిర్మాత SKN కౌంటర్ ఇచ్చారని పోస్టులు వైరల్ చేస్తున్నారు. బండ్ల గ‌ణేష్ అనే పేరు వాడ‌కుండానే, చుర‌క‌లు అంటించాడ‌ని SKNను లేపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కాగా ఒక్క సినిమా హిట్ అయితే చాలు, కొంతమంది హీరోలు, చిరిగిన పాయింట్లు, కళ్లద్దాలు పెట్టుకొని బిల్డప్ ఇస్తారని కామెంట్ చేశారు బండ్ల గణేష్. వాట్సప్ వాట్సప్ అంటే హిట్లు రావని విజయ్ దేవరకొండను ఉద్దేశించి పరోక్షంగా కామెంట్స్ చేశారు. క్లిక్

Next Story