- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Siva Karthikeyan: ‘SK-23’ టైటిల్, గ్లింప్స్ లోడింగ్..పవర్ ఫుల్ పోస్టర్‌తో హైప్ పెంచిన మేకర్స్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) గత ఏడాది ‘అమరన్’(Amaran) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) గత ఏడాది ‘అమరన్’(Amaran) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీని రాజ్ కుమార్ పెరియసామి మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించగా.. గత ఏడాది దీపావళి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే భారీ కలెక్షన్లు కూడా రాబట్టింది. దీంతో ఇదే ఫామ్‌తో శివకార్తికేయన్ వరుస చిత్రాలు ప్రకటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన 25వ చిత్రాన్ని సుధా కొంగర దర్శకత్వంలో చేస్తున్నారు. దీనికి ‘పరాశక్తి’(PARASAKTHI ) అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ఇక ఇందులో శ్రీలీల(Sreeleela), హీరోయిన్‌గా నటిస్తుండగా.. రవి మోహన్(Ravi Mohan), అధర్వ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, శివ కార్తికేయన్ ‘SK-23’ మూవీ అప్డేట్స్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు మురుగదాస్ దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీలక్ష్మి మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. దీనికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఇందులో శివ కార్తికేయన్ సరసన రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ఇక ‘SK-23’ టైటిల్, గ్లింప్స్ ఫిబ్రవరి17న ఉదయం 11 గంటలకు రాబోతున్నట్లు తెలపుతూ మేకర్స్ ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఈ పోస్టర్‌ను రుక్మిని ట్విట్టర్ ద్వారా షేర్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతూ అంచనాలను పెంచుతోంది.
— rukmini (@rukminitweets) February 16, 2025






