- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, సినిమా: రాగ్ మయూర్ (Rag Mayur), రూప లక్ష్మి (Roopalakshmi), మురళీధర్ గౌడ్ (Muralidhar Goud), సన్నీ పల్లె (Sunny Palle), ఉదయ్ గుర్రాల( Uday Gurrala), పావని కరణం (Pavani Karanam) తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సివరపల్లి’(Sivarapalli). హిందీలో ‘పంచాయత్’(Panchayath) అనే పేరుతో ఇప్పటికే రిలీజైన ఈ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో ఇప్పుడు ఈ వెబ్ సిరీస్‌ను తెలుగులో ‘సివరపల్లి’ అనే పేరుతో రీమేక్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్(Amazon Prime) వీడియోలో జనవరి 24 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ‘సివరపల్లి’ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుటోంది.
ఇక కథ విషయానికి వస్తే.. బీటెక్ పూర్తి చేసిన శ్యామ్(రాగ్ మయూర్) పై చదువుల కోసం అమెరికా (America)వెళ్లాలనుకుంటాడు. అయితే, తన తండ్రి బలవంతంతో పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం(Panchayat Secretary Job)లో జాయిన్ అవుతాడు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా(Kamareddy District), జుక్కల్ మండలంలో మారుమూల గ్రామమైన ‘సివరపల్లి’లో శ్యామ్ పోస్టింగ్ అవుతుంది. ఆ ఊరిలో మహిళా సర్పంచ్ సుశీల(రూపలక్ష్మీ) ఇంటికే పరిమితం అవగా.. ఆమె భర్త సుధాకర్ (మురళీధర్ గౌడ్) పెత్తనం చేస్తుంటాడు. తనకు ఇష్టం లేకున్నా స్నేహితుడి సలహా మేరకు ఉద్యోగంలో జాయిన్ అయిన శ్యామ్ ఆ పల్లెటూరులో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు..? నిజాయతీగా పని చేయాలనుకున్న శ్యామ్‌కు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఎలా అధిగమించాడు? అనేదే వెబ్ సిరీస్ కథ. పక్కా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ‘సివరపల్లి’ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు ఆకట్టుకుంటోంది. కాగా.. తెలుగులో టీవీఎఫ్ క్రియేషన్ బ్యానర్(TVF Creation Banner)పై అరుణాభ్ కుమార్ (Arunabh Kumar) నిర్మించిన ఈ సిరీస్‌కు భాస్కర్ మౌర్య (Bhaskar Maurya)దర్శకత్వం వహించాడు.






