- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Parasakthi: సంక్రాంతి బరిలో మరో స్టార్ మూవీ.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వీడియో వైరల్
శివ కార్తికేయన్ (Sivakarthikeyan) సినీ కెరీర్‌లో 25 వ ప్రాజెక్టుగా రాబోతున్న మూవీ ‘పరాశక్తి’ (Parasakthi).

దిశ, సినిమా: శివ కార్తికేయన్ (Sivakarthikeyan) సినీ కెరీర్‌లో 25 వ ప్రాజెక్టుగా రాబోతున్న మూవీ ‘పరాశక్తి’ (Parasakthi). పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీకి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టైటిల్ టీజర్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. దీంతో సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తుండగా.. ఈ సినిమా విడుదలపై అనేక ఊహగాణాలు వస్తు్న్నాయి. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు శివకార్తికేయన్ ఎక్స్ వేదికగా.. పరాశక్తి మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 14 థియేటర్లలోకి రాబోతున్నట్లు తెలిపాడు. టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జయం రవి, ఆథర్వ మురళి, రానా దగ్గుబాటి, అబ్బాస్, గురు సోమసుందరం తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. Link






