Parasakthi Movie: సంక్రాంతి బ‌రిలోకి మ‌రో హీరో..ఇంకాస్త ముందుగానే !

by velandi.Saikiran |

పరాశక్తి ( Parasakthi Movie ). జయం రవి, అథ‌ర్వ, రాణా దగ్గుబాటి ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు.

దిశ‌, వెబ్ డెస్క్‌: 2026 లో వచ్చే సంక్రాంతి పండుగ కానుకగా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తెలుగులోనే అరడజనుకు పైగా సినిమాలు వస్తున్నాయి. అటు తమిళ సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ లిస్టులోకి మరో సినిమా వచ్చేసింది. శివ కార్తికేయన్ ( Sivakarthikeyan), శ్రీ లీల హీరో హీరోయిన్లుగా వస్తున్న లేటెస్ట్ మూవీ పరాశక్తి ( Parasakthi Movie ). జయం రవి, అథ‌ర్వ, రాణా దగ్గుబాటి ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. సుధా కొంగర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పొలిటికల్ పిరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కింది.

అయితే ఈ సినిమా జనవరి 14వ తేదీన రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నారు. ఏమైందో తెలియదు కానీ ఇవాళ మరో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది చిత్ర బృందం. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన రిలీజ్ చేయాలని పోస్టర్ కూడా వదిలింది. దీంతో తెలుగుతో పాటు తమిళ బాక్సాఫీస్ ముందు ఆసక్తికర పోటీ నెలకొంది. జనవరి 9వ తేదీన విజయ నటించిన జన నాయగన్ రిలీజ్ కానుంది.

ఇప్పటికే ప్రకటన కూడా వెలువడింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన ఒక్క రోజు తర్వాత పరాశక్తి రానుంది. దీంతో ఏ సినిమా హిట్ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అటు తెలుగులో ఇదే సంక్రాంతికి ది రాజా సాబ్, మన శంకర వరప్రసాద్, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు లాంటి సినిమాలు వరుసగా వస్తున్నాయి. మరి సంక్రాంతి బరిలో వస్తున్న ఈ సినిమాలలో దేనిని, ప్రేక్షకులు ఆదరిస్తారో చూడాలి.

Next Story