- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Siva karthikeyan: నేను స్టెరాయిడ్స్ వాడుతున్నానని, నా ఆరోగ్యం పాడైందని పోస్ట్ చేశారు.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్
కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మదరాసి’.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మదరాసి’. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ ఆకట్టుకోగా.. సెప్టెంబర్ 5న అంటే మరికొన్ని గంటల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక మూవీ రిలీజ్ సమయం దర్గరపడుతున్న క్రమంలోనే వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా యాంకర్ సుమతో చిట్ చాట్‌లో పాల్గొన్న శివ కార్తికేయన్ పలు ఆశక్తికర విషయాలను పంచుకున్నాడు.
రేపు మార్నింగ్ నువ్వు శివకార్తికేయన్‌లా కాకుండా.. రజినీకాంత్‌లా లేస్తే మీరు చేసే మొదటి పని ఏంటీ? అని సుమ ప్రశ్నించగా.. ‘నేను వెంటనే 5 సినిమాలకు సైన్ చేస్తాను.. అలాగే రజినీ సర్ జీతం చాలా ఎక్కువ కాబట్టి ముందు అడ్వాన్స్‌లు తీసేసుకుంటాను. అంతే కాకుండా.. ఆ రోజు నేను అత్యంత సంతోషకరమైన వ్యక్తిని అవుతాను. ఎందుకంటే రజినీకాంత్ నాకు ఆదర్శం.. ఇది ఒక వరంగా ఫీల్ అవుతాను’ అని చెప్పుకొచ్చాడు శివకార్తికేయన్.
మీ గురించి ఏవైనా రూమర్స్ అండ్ నకిలీ థంబ్‌నెయిల్స్ వచ్చాయా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘అవును.. చాలా ఉన్నాయి. అమరన్ కోసం వాళ్ళు 8 ప్యాక్‌లు ఉన్న ఓ ఫొటోకు నా ఫేస్‌ను వాడుకున్నారు. అలాగే.. ఇటీవల మళ్లీ వాళ్లే నా ముఖాన్ని పెద్దది చేసి నేను స్టెరాయిడ్స్ వాడుతున్నానని, నా ఆరోగ్యం పాడైపోయిందని పోస్ట్ చేశారు.. నేను హాయ్‌గా నవ్వుతూ ఉన్నాను’ అంటూ నవ్వుకుంటా చెప్పుకొచ్చాడు హీరో. ప్రజెంట్ ఈ ఇంటర్వ్యూస్‌కి సంబంధించిన క్లిప్స్ వైరల్ అవుతున్నాయి.






