Siva Karthikeyan: విధ్వంసానికి కొత్త అర్థం ఉంది.. హైలెట్‌గా సెకండ్ పోస్టర్

by Chukka Sudharani |

కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) ప్రజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Siva Karthikeyan: విధ్వంసానికి కొత్త అర్థం ఉంది.. హైలెట్‌గా సెకండ్ పోస్టర్
X

దిశ, సినిమా: కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) ప్రజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ‘SK-23’ ఒకటి. మురుగదాస్ (Murugadoss) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను.. శ్రీ లక్ష్మి మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నారు. ఇందులో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasant) హీరోయిన్‌గా నటిస్తు్న్నట్లు తెలుస్తుండగా దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా Sk-23 కి సంబంధించిన టైటిల్, గ్లింప్స్, ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘Sk-23 సినిమాకు ‘మదరాసి’ అనే టైటిల్ ఫిక్స్ చేశాము.. భారీ చర్యకు రంగం సిద్ధమైంది. HAVOC ప్రారంభం’ అంటూ రాసుకొచ్చింది. ఇక సెకండ్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ‘వేడుక ఇంకా ముగియలేదు.. మదరాసి.. దిల్ మదరాసి సెకండ్ లుక్ పోస్టర్ ఇప్పుడు వచ్చింది. విధ్వంసం అనే పదానికి కొత్త అర్థం ఉంది’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ రెండు పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో శివ కార్తికేయన్ యాంగ్రీ బర్డ్ రూపంలో చాలా వైల్డ్‌గా కనిపిస్తుండగా.. ప్రజెంట్ ఈ పోస్టర్స్‌కు నెట్టింట విశేష స్పందన లభిస్తోంది.

Next Story