Siva karthikeyan: చాలా ఉత్సాహంగా ఉన్నాను.. తన తుదుపరి చిత్రాలను ప్రకటించిన శివకార్తికేయన్

by Chukka Sudharani |

కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మదరాసి’.

Siva karthikeyan: చాలా ఉత్సాహంగా ఉన్నాను.. తన తుదుపరి చిత్రాలను ప్రకటించిన శివకార్తికేయన్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మదరాసి’. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి రిలీజ్‌కు ముందు వచ్చిన ప్రతీ అప్డేట్ ఆకట్టుకోగా.. సెప్టెంబర్ 5న భారీ అంచనాల మధ్య వచ్చింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రానిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా థాంక్యూ మీట్ ఏర్పాటు చేశారు చిత్ర బృందం. ఇందులో భాగంగా శివ కార్తికేయన్ తన నెక్ట్స్ సినిమాలకు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. ‘నేను డైరెక్టర్‌తో సిబి చక్రవర్తితో ఒక సినిమా చేస్తాను. ఆ సినిమా ఎలా వస్తుందో చూడాలని ఆసక్తిగా ఉన్నాను. అదే నా తదుపరి ప్రాజెక్ట్. దాని తర్వాత వెంకట్ ప్రభు సర్ సినిమా ఉంటుంది. అలాగే పుష్కర్ గాయత్రితో చేయబోయే సినిమా ఇంకా చర్చల్లో ఉంది. లైన్-అప్‌ల గురించి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను’ అని తెలిపాడు.

Next Story