Rishabh Shetty: కొత్త సినిమాతో రానున్న రిషబ్ శెట్టి..ఎవ‌రితో అంటే ?

by velandi.Saikiran |

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో రిషబ్ శెట్టి హీరోగా ఓ సినిమా రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది

Rishabh Shetty:  కొత్త సినిమాతో రానున్న రిషబ్ శెట్టి..ఎవ‌రితో అంటే ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాంతార , కాంతార చాప్టర్ 1 సినిమాలతో ఇండస్ట్రీలను షేక్ చేశాడు. మొన్న దసరా కానుకగా కాంతార చాప్టర్ 1 సినిమాతో వచ్చిన రిషబ్ శెట్టి, దాదాపు రూ. 800 కోట్ల వసూళ్లు రాబట్టాడు. కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా ఈ చాప్టర్ 1 వచ్చింది. దీంతో జనాలందరూ ఎగబడి చూశారు. అయితే ఇప్పుడు రిషబ్ శెట్టి తన తర్వాతి ప్రాజెక్టుపై ఫోకస్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే టాలీవుడ్ సర్కిల్ లో ఓ న్యూస్ వైరల్ గా మారింది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో రిషబ్ శెట్టి హీరోగా ఓ సినిమా రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇది ఓ యోధుడి కథ అని సమాచారం. చరిత్రలో మరుగున పడిపోయిన ఓ పోరాట గాధ అని టాక్ వినిపిస్తోంది. బంకించంద్ర ఛటర్జీ రచించిన ఆనంద్ మఠ్ అనే పుస్తకం నుంచి స్ఫూర్తిగా తీసుకొని ఈ కథను దర్శకుడు అశ్విన్ గంగరాజు రూపొందించినట్లు తెలుస్తోంది. 2026 వేసవిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట.

Next Story