ఎట్టకేలకు 'సితారే జమీన్ పర్' ఓటీటీ పార్ట్‌నర్ లాక్

by Pulgam srinivas |

సితారే జమీన్ పర్ ఓటీటీ హక్కులను సోనీ లీవ్ సంస్థ దక్కించుకుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాను తమ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది.

ఎట్టకేలకు సితారే జమీన్ పర్ ఓటీటీ పార్ట్‌నర్ లాక్
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ఆమీర్ ఖాన్ కొంతకాలం క్రితం 'సితారే జమీన్ పర్' అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పోయిన సంవత్సరం జూన్ 20వ తేదీన విడుదలైన ఈ సినిమా ఆ తర్వాత నెల లేదా రెండు నెలల్లో ఏదో ఒక ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ ఈ సినిమా విడుదలై ఇప్పటికే ఆరు నెలల పైగా అవుతున్నా ఏ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వలేదు.

ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ లాక్ అయింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వెలువడింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను సోనీ లీవ్ ఓటీటీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సంస్థ వారు మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాను తమ డిజిటల్ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆమీర్ ఖాన్, అపర్ణ పురోహిత్ సంయుక్తంగా నిర్మించారు.




Next Story