- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన సీతా పయనం
సీతా పయనం డిజిటల్ హక్కులను సన్ నెక్స్ట్ సంస్థ దక్కించుకుంది. ఈరోజు నుండి ఈ చిత్రాన్ని ఈ సంస్థ వారు తమ ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నటుడు అర్జున్ సర్జా నటించి, దర్శకత్వం వహించి, నిర్మించిన చిత్రం సీతా పయనం. ఇందులో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలో నటించింది. నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 14న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేశారు.
విడుదలకు ముందు పెద్ద ఎత్తున ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను నిర్వహించారు. దానితో 'సీతా పయనం'పై ప్రేక్షకుల్లో కాస్త మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలా విడుదల అయిన ఈ మూవీ పర్వాలేదనే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను సన్ నెక్స్ట్ సంస్థ దక్కించుకుంది.
ఈరోజు నుండి ఈ చిత్రాన్ని ఈ సంస్థ వారు తమ ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. ఐశ్వర్య అర్జున్ ఈ మూవీతోనే నటిగా వెండితెరకు పరిచయం అయ్యింది. అయినా కూడా తనదైన నటనతో ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై అర్జున్ నిర్మించాడు.






