సీతా పయనం.. అస్సలు సినిమా ఇదే..

by Sujitha Rachapalli |

మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా 'సీతా పయనం'. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

సీతా పయనం.. అస్సలు సినిమా ఇదే..
X

దిశ, సినిమా : మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలో నటించగా.. నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్ కింగ్ అర్జు‌తోపాటు అతని మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా స్పెషల్ కామియో చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా ఈ సినిమా నుంచి ‘అస్సలు సినిమా’ అనే సాంగ్ రిలీజ్ చేశారు. ‘ఆహా ఓహో అంటాడు.. అందం నీదే అంటాడు’ అనే పదాలతో మొదలైన ఈ సాంగ్ ఊపుతెప్పించే లిరిక్స్‌తో ఆకట్టుకుంటోంది. చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ పాటను శ్రీయ ఘోషల్ పాడారు.

Next Story