లేటు వయసులో డాక్టరైన సోదరి.. బర్త్ డే రోజున స్టార్ హీరో ఎమోషనల్ పోస్ట్

by Chukka Sudharani |

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) రీసెంట్‌గా ‘అమరన్’(Amaran) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

లేటు వయసులో డాక్టరైన సోదరి.. బర్త్ డే రోజున స్టార్ హీరో ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) రీసెంట్‌గా ‘అమరన్’(Amaran) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీంతో నెలరోజుల పాటు థియేటర్లలో సందడి చేసింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ(OTT)లోకి కూడా వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెటిఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోగా.. ఈ రోజు (డిసెంబర్-5) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ప్రజెంట్ అమరన్ సక్సెస్‌ను టీమ్ ఎంతో ఎంజాయ్ చేస్తు్న్నారు.

ఇదిలా ఉంటే.. శివకార్తికేయన్ తాజాగా X వేదికగా తన సోదరి కోసం ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ‘నా ప్రియమైన అక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. 38 సంవత్సరాల వయసులో బిడ్డ పుట్టిన తర్వాత MBBS పూర్తి చేయడం.. అంతే కాకుండా గోల్డ్ మెడల్‌తో మెరిట్‌పై MD సంపాదించడం అండ్ ఇప్పుడు 42 సంవత్సరాల వయస్సులో FRCP సాధించడం వరకు.. మీరు ఎన్నిటినో ఎదుర్కొని సాధించారు. అక్క మిమ్మల్ని చూస్తుంటే నిజంగా గర్వంగా ఉంటుంది. మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు! ప్రియమైన అథాన్, ఎల్లప్పుడూ ఆమెకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు’ అంటూ చెప్పొకొచ్చాడు.

Next Story