- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాక్సాఫీసు వద్ద దూసుకుపోతున్న ‘సింగిల్’.. రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు(Sree Vishnu) గత ఏడాది రెండు సినిమాల్లో నటించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఈ చిత్రాలు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు(Sree Vishnu) గత ఏడాది రెండు సినిమాల్లో నటించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఈ చిత్రాలు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి. అయితే హిట్, ఫ్లాప్ పట్టించుకోకుండా శ్రీవిష్ణు వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ యంగ్ హీరో, కార్తీక్ రాజు(Karthik Raju) కాంబోలో వచ్చిన మూవీ ‘సింగిల్’. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో కేతిక శర్మ(Ketika Sharma), ఇవానా హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్(Allu Aravind) సమర్పణలు కళ్యా ఫిల్మ్స్‌పై విద్యా కొప్పినీడి, భాను ప్రతాప(Bhanu Pratapa), రియాజ్ చౌదరి నిర్మించిన ఈ సినిమా మే 9న థియేటర్స్‌లోకి వచ్చింది.
అయితే ఈ చిత్రం విడుదలైన కానుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అలాగే కలెక్షన్లు కూడా బాగానే రాబడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా, రెండు రోజుల కలెక్షన్లు షేర్ చేస్తూ శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ పార్టీ మూడ్‌లో ఉన్న పోస్టర్‌ను షేర్ చేశారు. తొలి రోజే 4.15 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. ఇక రెండో రోజు ఈ చిత్ర వసూళ్లు పెరిగాయి. ఈ మూవీ రెండు రోజుల్లో 11.2కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా బుక్ మై షోలో ఎక్కువ టికెట్స్ అమ్ముడు పోతున్నట్లు తెలుస్తోంది. ఇక నేడు సండే కావడంతో ‘సింగిల్’ మూవీ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.






