లైవ్ షోలో రెచ్చిపోయిన సింగర్.. 69 ఏళ్ల వయసులో ఇదేం పనంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-02-04 12:27:18  IST  )

బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్(Udit Narayan) ఎన్నో పాటలు పాడి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రాంతీయ భాషల్లోనూ సాంగ్స్ పాడి అందరి మనసులు గెలుచుకున్నారు.

లైవ్ షోలో రెచ్చిపోయిన  సింగర్.. 69 ఏళ్ల వయసులో ఇదేం పనంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు  (వీడియో)
X

దిశ, సినిమా: బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్(Udit Narayan) ఎన్నో పాటలు పాడి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రాంతీయ భాషల్లోనూ సాంగ్స్ పాడి అందరి మనసులు గెలుచుకున్నారు. అంతేకాకుండా నాలుగుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ఆయనను ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషన్‌తో సత్కరించిన విషయం తెలిసిందే. ఆయనకు 69 ఏళ్లు వచ్చినప్పటికీ రెస్ట్ తీసుకోకుండా తన గొంతుతో అందరినీ మంత్రముగ్దులను చేస్తున్నారు. నాలుగు జాతీయ అవార్డులు అందుకుని దేశవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న ఆయన అభిమానితో హద్దు మీరి ప్రవర్తించడం దుమారం రేపుతోంది. ఏకంగా లైవ్ షోలోనే అమ్మాయిలకు లిప్ లాక్‌లు ఇచ్చి రెచ్చిపోయారు.

ఇటీవల ఉదిత్ ఓ షోలో స్టేజీపై లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. అయితే ఈ క్రమంలోనే.. కొంతమంది అమ్మాయిలు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు స్టేజి దగ్గరకు వెళ్లారు. దీంతో సెల్ఫీతో పాటు ఆయన ముద్దు పెట్టుకోవడం నెట్టింట వివాదానికి దారి తీసింది. ప్రస్తుతం ఉదిత్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో ఆయన లైవ్ పర్ఫామెన్స్ ఇస్తుండగా.. కొంతమంది సెల్ఫీలు తీసుకునేందుకు రాగా.. ఓ అమ్మాయి ఆయన చెంపను ముద్దాడింది. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న ఉదిత్.. ఏకంగా ఆమె పెదాలపై ముద్దు పెట్టేశారు. దీంతో ఆ లేడీ అభిమాని కూడా షాక్‌కు గురి కావడంతో పాటు నోరెళ్లబెట్టింది. ఇక అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.

ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. 69 ఏళ్ల వయసులో ఇలాంటి పనులేందని మండిపడుతున్నారు. కూతురు వయసున్న అమ్మాయితో ఇలాగేనా ప్రవర్తించేది.. అలా చేసి నీ పలుకుబడిని చెడగొట్టుకున్నావ్? ఛీ ఇంత చీప్‌ అనుకోలేదని దారుణంగా మాట్లాడుతున్నారు. కానీ కొంతమంది మాత్రం మొదటి ఆ అమ్మాయి ముద్దు పెట్టిందని సింగర్‌కు సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోపై విమర్శలు వస్తుండటంతో.. ఈ సంఘటనపై ఉదిత్ స్పందించారు. ‘‘అభిమానులకు నేనంటే ఇష్టం. తమ ఇష్టాన్ని తెలియజేయడానికి వారు ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. ఇందులో భాగంగానే కొందరు ముద్దు పెట్టుకోవాలనుకుంటారు. అది కేవలం ఆత్మీయతతో కూడుకున్న విషయం మీరు దీనిని తప్పుగా అర్థం చేసుకోకండి నాకు అలాంటి ఉద్దేశం లేదు. నేను వివాదాలకు దూరంగా ఉంటాను. కానీ కొంతమంది ముద్దు సంఘటనను వివాదంగా చూస్తున్నారు’’ అన్నారు.


Click Here Tweet..

Next Story