ఎవరు టచ్ చేయని కాన్సెప్ట్‌తో సింగీతం శ్రీనివాసరావు నెక్స్ట్ మూవీ.. మ్యూజిక్ డైరెక్టర్ అతనే?

by Pulgam srinivas |

సింగీతం శ్రీనివాసరావు నెక్స్ట్ మూవీ మొత్తం పాటలతోనే సాగనున్నట్లు, దానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది.

ఎవరు టచ్ చేయని కాన్సెప్ట్‌తో సింగీతం శ్రీనివాసరావు నెక్స్ట్ మూవీ.. మ్యూజిక్ డైరెక్టర్ అతనే?
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వారిలో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. సాధారణంగా సీనియర్ దర్శకులు అవుట్‌డేటెడ్ అయిపోతారని, కొత్త ఆలోచనలు చేయలేరనే అభిప్రాయం ఉంటుంది. కానీ అలాంటి ట్యాగ్‌లు సింగీతంకి అసలు సరిపోవు. ప్రస్తుతం 94 ఏళ్ల వయస్సులో కూడా ఆయన యంగ్ డైరెక్టర్లకు ఏమాత్రం తీసిపోకుండా అప్డేట్‌గా ఆలోచిస్తున్నారు. తాజాగా ఆయన తదుపరి సినిమాపై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించబోతుండగా, సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందించనున్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే—ఇది పూర్తిగా పాటలతోనే సాగుతుంది. ప్రతి సన్నివేశాన్ని పాటల ద్వారానే చెప్పే విధంగా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయని ఈ వినూత్న కాన్సెప్ట్‌పై సినిమా తెరకెక్కుతోంది. 94 ఏళ్ల వయస్సులో కూడా ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని తీస్తుండటం నిజంగా విశేషం. ఈ మ్యూజికల్ ఎక్స్‌పెరిమెంట్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Next Story