- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెలరోజులకే ఓటీటీలోకి రాబోతున్న ‘సింగ్ గీతం’.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు
థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా, ఇప్పుడు విడుదలైన నెల రోజులకే డిజిటల్ స్క్రీన్‌పై అలరించేందుకు రెడీ అయిపోయింది.

దిశ, సినిమా: వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు.. 94 ఏళ్ల వయసులోనూ నేటి తరం ప్రేక్షకులను మెప్పించడానికి తీసిన సినిమా ‘సింగ్‌గీతం’. ‘కల్కి 2898 ఏడీ’ ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ మ్యూజికల్ ఫాంటసీ డ్రామాలో అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి, తులసి, బెనర్జీ, శివనారాయణ, అగు స్టాన్లీ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గత నెల జూన్ 12న థియేటర్లలోకి వచ్చి, బాక్సాఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా అటు ప్రేక్షకుల ప్రశంసలతో పాటు సినీ సెలబ్రిటీల మనసులను కూడా గెలుచుకుంది. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా, ఇప్పుడు విడుదలైన నెల రోజులకే డిజిటల్ స్క్రీన్‌పై అలరించేందుకు రెడీ అయిపోయింది.
‘సింగ్‌గీతం’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. జూలై 9 నుండి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియాలోని మిగతా ప్రధాన భాషలైన తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఒకేసారి అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు, అలాగే సింగీతం శ్రీనివాసరావు గారి మ్యాజిక్‌ను మళ్లీ చూడాలనుకునే వాళ్లు జూలై 9 నుండి ఓటీటీలో ఈ మ్యూజికల్ వండర్‌ను ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అయితే డిజిటల్ స్ట్రీమింగ్‌కు ముందు బిగ్ సర్‌ప్రైజ్ ఉంటుందని నాగ్ అశ్విన్ గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే... థియేటర్ వెర్షన్ కంటె డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పడంతో.. సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.






