- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సింధూరి’ మూవీ లాంచ్
by Sujitha Rachapalli |
‘సింధూరి’ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈశ్వర్ హీరోగా ఐశ్వర్య హీరోయిన్‌గా తెరకెక్కుతున్న మూవీకి కెకె దర్శకులు కాగా కిషోర్ బాబు నిర్మాతగా లీలారెడ్ది, రావు సమర్పిస్తున్నారు.

X
దిశ, సినిమా : ‘సింధూరి’ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈశ్వర్ హీరోగా ఐశ్వర్య హీరోయిన్‌గా తెరకెక్కుతున్న మూవీకి కెకె దర్శకులు కాగా కిషోర్ బాబు నిర్మాతగా లీలారెడ్ది, రావు సమర్పిస్తున్నారు. నరాల నాగేశ్వరరావు రచనా సహకారం అందిస్తున్న ఈ సినిమాకు జయబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. 90 రోజులు నాన్ స్టాప్‌గా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుకోనున్న సినిమా.. ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమ కథ. అబ్బాయి గోవిందు, అమ్మాయి పేరు సింధూరి. చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కారణంగా ఆ అబ్బాయికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అన్నదే సినిమా. తననే ప్రాణంగా ప్రేమించిన ఆ అబ్బాయికి తనలాగే వున్న మరో అమ్మాయిని చూసి పెళ్లి చేయాలనుకునే ఒక అమ్మాయి కథ. వీళ్ళిద్దరూ అనుకున్నది జరిగిందా లేదా? చివరికి ఏమైంది అన్నదే ఈ కథ.
Next Story






