- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విరాట్ కోహ్లీ బయోపిక్ లో తమిళ్ హీరో!
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా కు ఎన్నో విజయాలు

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా కు ఎన్నో విజయాలు అందించిన విరాట్ కోహ్లీ... ఎన్నో రికార్డులు కూడా అందుకున్నాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత విరాట్ కోహ్లీ అన్న రీతిలో.. దాదాపు 15 సంవత్సరాల పాటు టీమ్ ఇండియాలో కొనసాగాడు. అయితే ఇప్పటికే టి20 మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ... మొన్న టెస్టులకు కూడా గుడ్ బై చెప్పాడు.
ప్రస్తుతం కేవలం వన్డే మ్యాచ్ లలో మాత్రమే... ఆడుతున్నాడు విరాట్ కోహ్లీ. అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఓవరాల్ గా విరాట్ కోహ్లీ కెరీర్ దాదాపు ముగిసింది అనే చెప్పవచ్చు. ఇలాంటి నేపథ్యంలో.. విరాట్ కోహ్లీ బయోపిక్ తీసేందుకు కొంతమంది దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ గ్యాప్ లోనే.. హీరోలను కూడా వెతుకుతున్నారట. ఈ వార్త బయటకు రావడంతో... తమిళ్ హీరో శింబు పేరు తెర పైకి వచ్చింది. విరాట్ కోహ్లీ బయోపిక్ లో తాను నటిస్తానని ఇప్పటికే శింబు ప్రకటించాడు. విరాట్ కోహ్లీ అంటే తనకు చాలా ఇష్టమని... అలాంటి ప్లేయర్ బయోపిక్ లో నటిస్తే తనకు గర్వంగా ఉంటుందని గతంలో శింబు వెల్లడించాడు. తాజాగా ఇదే విషయం.. తన వద్దకు రావడంతో ఇదే.. అభిప్రాయాన్ని మరోసారి వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.






