సైలెంట్‌గా దూసుకెళ్తున్న దిల్ రాజు.. చేతిలో అన్ని ప్రాజెక్టులు

by Pulgam srinivas |

దిల్ రాజు ప్రస్తుతం “దేత్తడి”, “రౌడీ జనార్ధన”, “ఎల్లమ్మ” చిత్రాలను నిర్మిస్తున్నారు. అలాగే వీటితో పాటు “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాను హిందీలో అక్షయ్ కుమార్‌తో రీమేక్ చేస్తున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్‌తో కూడా ఒక భారీ సినిమాను ప్రారంభించారు.

సైలెంట్‌గా దూసుకెళ్తున్న దిల్ రాజు.. చేతిలో అన్ని ప్రాజెక్టులు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినీ పరిశ్రమలో అనేక సంవత్సరాలుగా తిరుగులేని నిర్మాతగా కొనసాగుతున్న వారిలో దిల్ రాజు ఒకరు. ఆయన “దిల్” అనే చిత్రంతో నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ సినిమా నుంచే వరుసగా భారీ విజయాలను అందుకుంటూ టాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. అయితే గత కొంతకాలంగా ఆయన కెరియర్ ప్రారంభ దశలో సాధించిన స్థాయి విజయాలను అందుకోలేకపోతున్నారు. గత ఏడాది వచ్చిన “గేమ్ చెంజర్” సినిమాతో భారీ ఫ్లాప్‌ను ఎదుర్కొన్న దిల్ రాజు, ఆ తర్వాత “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు. కానీ అనంతరం వచ్చిన “తమ్ముడు” సినిమాతో మళ్లీ నిరాశ ఎదురైంది.

ప్రస్తుతం దిల్ రాజు చాలా సైలెంట్‌గా భారీ ప్రాజెక్టులను సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆయన చేతిలో ప్రస్తుతం అనేక క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పటికే తన సోదరుడి కుమారుడు ఆశిష్ హీరోగా “దేత్తడి” సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండతో “రౌడీ జనార్ధన”, దేవిశ్రీ ప్రసాద్ హీరోగా “ఎల్లమ్మ” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా వెండితెరకు పరిచయం కానున్నారు. ఇక తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా ఒక భారీ ప్రాజెక్టును కూడా ప్రారంభించారు. అంతేకాకుండా హిందీలో “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాను అక్షయ్ కుమార్‌తో రీమేక్ చేస్తున్నారు. ఈ విధంగా ప్రస్తుతం దిల్ రాజు చేతిలో అనేక భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో కొన్ని మంచి విజయాలను సాధించిన ఆయన మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story