Sikander: సికందర్ ట్రైలర్ విడుదల.. భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు ఆకట్టుకుంటోన్న రష్మిక- సల్మాన్ ఖాన్ కెమిస్ట్రీ

by Kodari Anjali |

బాలీవుడ్ ప్రముఖ నటుడు అండ్ రష్మిక మందన్న నటిస్తోన్న సికందర్ మూవీ కోసం ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Sikander: సికందర్ ట్రైలర్ విడుదల.. భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు ఆకట్టుకుంటోన్న రష్మిక- సల్మాన్ ఖాన్ కెమిస్ట్రీ
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్(Salman Khan) అండ్ రష్మిక మందన్న నటిస్తోన్న సికందర్ (Sikander)మూవీ కోసం ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు జనాల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ట్రైలర్ విడుదల అయ్యింది. సల్మాన్ ఖాన్ భారీ యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టారు.

అలాగే నేషనల్ క్రష్ రష్మిక, బాలీవుడ్ హీరో కెమిస్ట్రీ జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. మొదట్లో ఈ జోడిపై అనేక విమర్శలు వచ్చినప్పటికీ.. ప్రస్తుతం ట్రైలర్ వీక్షించిన జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటించనుందని తెలుస్తోంది. అలాగే సత్యరాజ్ విలన్‌గా నటించనున్నాడు. గజిని సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నమురుగదాస్ ఇప్పుడు సికందర్‌తో పక్కా మరొసారి హిట్ కొట్టనున్నాడని జనాలు అంచనా వేస్తున్నారు.

ఏకంగా సల్మాన్ ఖాన్ మూవీ రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి చేరుకోవడం పక్కా అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరీ మూవీ ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటుందో మార్చి 30 వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ట్రైలర్ మాత్రం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ ట్రైలర్‌ను రష్మిక మందన్న (Rashmika MandRashmika Mandannaanna) నెట్టింట పంచుకుందిక. ‘సికందర్ ట్రైలర్ ఇప్పుడు విడుదలైంది. సినిమాల్లో కలుద్దాం’ అంటూ ఫైర్ సింబల్ జోడించి ఓ క్యాప్షన్ జోడించింది.

Next Story