SIIMA 2025: సైమా అవార్డ్స్‌.. ఉత్తమ నటీనటులు వీళ్లే.. సత్తా చాటిన కమిటీ కుర్రోళ్లు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-09-07 06:31:36  IST  )

దుబాయ్ లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025 (SIIMA2025) వేడుక ఘనంగా జరిగింది.

SIIMA 2025: సైమా అవార్డ్స్‌.. ఉత్తమ నటీనటులు వీళ్లే.. సత్తా చాటిన కమిటీ కుర్రోళ్లు
X

దిశ, సినిమా: దుబాయ్ లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025 (SIIMA2025) వేడుక ఘనంగా జరిగింది. సినీతారలంతా ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. ఇప్పటికే తెలుగులో పుష్ప -2, కల్కి సినిమాలు అత్యధిక అవార్డులు దక్కించుకోగా.. కోలీవుడ్ లో ఉత్తమ చిత్రంగా అమరన్ అవార్డు అందుకుంది. అదే సినిమాలో సాయిపల్లవి నటనకు ఉత్తమ నటిగా అవార్డు దక్కింది. ఇక మళయాళంలో ఉత్తమ చిత్రంగా మంజుమ్మల్ బాయ్స్ నిలవగా, ది గోట్ లైఫ్ లో నటనకు గాను పృథ్వీరాజ్ సుకుమారన్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.

సైమా అవార్డుల్లో వరుసగా మూడో ఏడాది ఉత్తమ నటుడిగా అవార్డు అందుకుని అల్లు అర్జున్ హ్యాట్రిక్ కొట్టారు. ఇందుకు సుకుమారే కారణమన్న బన్నీ.. అవార్డును తన అభిమానులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఉత్తమ డెబ్యూ నిర్మాతగా నిహారిక కొణిదెల (Niharika Konidela) అవార్డు అందుకోవడం విశేషం. బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా సందీప్ సరోజ్ (Sandeep Saroj)కి సైమా అవార్డు వచ్చింది.

ఉత్తమ సినిమా - కల్కి 2898 ఏడీ

ఉత్తమ సహాయ నటుడు - అమితాబచ్చన్ (కల్కి 2898 ఏడీ)

ఉత్తమ సహాయ నటి - అన్నా బెన్ (కల్కి 2898 ఏడీ)

ఉత్తమ విలన్ - కమలాహాసన్ (కల్పి 2898 ఏడీ)

ఉత్తమ డెరెక్టర్ - సుకుమార్ (పుష్ప 2)

ఉత్తమ నటి - రష్మిక (పుష్ప -2)

ఉత్తమ సింగర్ - శంకర్ కందూరి (పుష్ప -2)

ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ - దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప -2)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్)- తేజ సజ్జా (హనుమాన్)

ఉత్తమ డైరెక్టర్ (క్రిటిక్స్) - ప్రశాంత్ వర్మ (హనుమాన్)

ఉత్తమ నటి (క్రిటిక్స్) - లక్కీ భాస్కర్

ఉత్తమ పరిచయ డైరెక్టర్ - నందకిషోర్ (35 చిన్న కథ కాదు)

ఉత్తమ లిరిసిస్ట్ - రామజోగయ్య శాస్త్రి (దేవర)

ఉత్తమ ఫిమేల్ సింగర్ - శిల్పారావు (దేవర)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - రత్నవేలు (దేవర)

ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా - అశ్వనీదత్ (వైజయంతి మూవీస్)

Next Story