- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sidhu Jonnalagadda: ప్రేమలో పడేందుకు సిద్ధమా.. యూత్‌ను ఆకట్టుకుంటోన్న క్యూట్ పోస్టర్
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’.

దిశ, సినిమా: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘కొన్ని మెలోడీల కోసం వేచి చూసే ప్రతి సెకను చాలా విలువైనవిగా ఉంటుంది.. జులై 28న ‘తెలుసు కదా’ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘మల్లికగంధ’ రాబోతోంది. ఈ సాంగ్‌తో ప్రేమలో పడేందుకు సిద్ధంగా ఉండండి’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. విడుదల చేసిన పోస్టర్‌లో హీరో, హీరోయిన్స్ చేతులు మాత్రమే కనిపిస్తుండగా.. ఈ క్యూట్ పోస్టర్ యువతను ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ మూవీతో నీరజా కోన దర్శకురాలిగా డెబ్యు చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజీ విశ్వ ప్రసాద్, టిజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ కాగా.. వైవా హర్ష కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘తెలుసు కదా’ సినిమా ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 17న తెలుగు, తమిళం, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది.






