Siddu Jonnalagadda: స్టార్ బాయ్ బర్త్ డే ట్రీట్‌గా ‘జాక్’ టీజర్.. మరొక బ్లాక్ బస్టర్ రాబోతుందంటున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-02 15:32:39  IST  )

సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda), బొమ్మరిల్లు భాస్కర్(Bhaskar) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘జాక్ - కొంచెం క్రాక్’.

Siddu Jonnalagadda: స్టార్ బాయ్ బర్త్ డే ట్రీట్‌గా ‘జాక్’ టీజర్.. మరొక బ్లాక్ బస్టర్ రాబోతుందంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda), బొమ్మరిల్లు భాస్కర్(Bhaskar) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘జాక్ - కొంచెం క్రాక్’. ఇందులో వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్(Prakash Raj), బ్రహ్మాజీ వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సారి తన శైలిని పూర్తిగా పక్కన పెట్టి ఏదో సందేశాన్ని ఇస్తూనే కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడించారని అర్థం అవుతోంది. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ చిత్రానికి సంగీతం అచ్చు రాజమణి స్వరాలు సమకుర్చారు.

అయితే ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ మొదలెట్టిన మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. నేడు సిద్ధు జొన్నలగడ్డ పుట్టిన రోజు (ఫిబ్రవరి 7) సందర్భంగా ‘జాక్ - కొంచెం క్రాక్’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సిద్ధు బర్త్ డే స్పెషల్‌గా మేకర్లు జాక్ టీజర్‌‌ను విడుదల చేశారు. టీజర్‌లో సీనియర్ నటుడు నరేష్, సిద్దు మధ్య వచ్చే తండ్రీ కొడుకులకు సంబంధించిన స‌న్నివేశాలు ప్రేక్షకుల‌కు న‌వ్వులు పంచుతాయ‌ని అర్థం అవుతుంది.

ఇక హీరోల పాత్రలోని డిఫరెంట్ షేడ్స్ ఈ టీజర్‌లో చూపించాడు. అసలు హీరో ఏంటి? ఏ ఉద్యోగం చేస్తున్నాడు? అతని లక్ష్యం ఏంటి? అతని గమ్యం ఏంటి? ఆ పోరాటాలు ఏంటి? ఈ ప్రేమ కథ ఏంటి? అని ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తేలా, సినిమా మీద ఆసక్తి పెంచేలా టీజర్‌ను కట్ చేశారు. సిద్దు నుంచి మరొక బ్లాక్ బస్టర్ హిట్ రాబోతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Click For Video..

Next Story