- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Siddu Jonnalagadda: మైక్ ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడకూడదు.. మీడియాపై సిద్ధు జొన్నలగడ్డ ఫైర్
ఈ మధ్య కాలంలో సినిమా ప్రెస్ మీట్స్‌లో రిపోర్టర్స్ ప్రశ్నలు ఎక్కువగా వివాదాలకు దారితీస్తున్నాయి.

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో సినిమా ప్రెస్ మీట్స్‌లో రిపోర్టర్స్ ప్రశ్నలు ఎక్కువగా వివాదాలకు దారితీస్తున్నాయి. రీసెంట్‌గా ప్రదీప్ రంగనాథన్, కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్ కాగా.. తాజాగా సిద్ధు జొన్నలగడ్డ కూడా మీడియాపై ఫైర్ అయ్యాడు. ఆయన నటిస్తున్న ‘తెలుసు కదా’ చిత్రం అక్టోబర్ 17న రిలీజ్ కావాల్సి ఉండగా.. ఇటీవల ఓ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న సిద్ధుకు ‘మీరు రియల్ లైఫ్‌లో ఉమనైజరా?’ అంటూ ఓ ప్రశ్న ఎదురైంది. దీనిపై తాజాగా స్పందించిన సిద్ధు జొన్నలగడ్డ.. ‘నాకు మీ ప్రశ్నలకు ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు. అలా మాట్లాడటం చాలా డిస్‌రెస్పెక్ట్‌ఫుల్. మైక్ ఉంది కదా అని అలా ప్రశ్నలు అడిగి మళ్లీ నవ్వుతున్నారు.
అసలు ఆ రిపోర్టర్ లాస్ట్ మినిట్‌లో కాల్ చేసి అడిగితే రమ్మని చెప్పాము. మైక్ ఉంది కదా అని అలాంటి ప్రశ్నలు అడగటం కరెక్ట్ కాదు. ఇక నేను దీని మీద ఏమని స్పందించాలి.. నేను ఇలాంటి విషయంలో డిస్కషన్ చేయాలి అనుకోను. నిజానికి అసలు రేసులో ఉందా లేదా అనుకున్న పరిస్థితి నుంచి, నిన్న ట్రైలర్‌కి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ తర్వాత అంతా పాజిటివ్‌గా మారిపోయింది. అయినా సినిమాలో పోలీస్‌లా కనిపిస్తే నిజజీవితంలో పోలీస్‌లా ఉంటారా.. అలాగే క్రిమినల్ అయితే క్రిమినల్ అవుతారా.. ఏదైనా సినిమా వరకే ఉంటుంది.. మీ దగ్గర మైక్ ఉందని, మేము ఆన్సర్ ఇచ్చే పోజిషన్‌లో ఉన్నామని ఏది పడితే అది అడిగితే ఎలా’ అంటూ ఫైర్ అయ్యాడు సిద్ధు.






