సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌ నోటి దూల...పాప్ కార్న్ పంచాయితీ అంటూ !

by velandi.Saikiran |

సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌ నోటి దూల హాలీవుడ్ సినిమాల్లో ఇంటర్వెల్ అస్సలు ఉండదని తెలిపాడు. ఇక సెకండాఫ్ లో డిప్

సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌ నోటి దూల...పాప్ కార్న్ పంచాయితీ అంటూ !
X

దిశ‌, వెబ్ డెస్క్ : టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమా స్టార్టింగ్ నుంచి చివరి వరకు చాలా ఎనర్జిటిక్ గా ఉండే సిద్దు జొన్నలగడ్డ, తాజాగా తెలుసు కదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో రాశి ఖ‌న్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా చేశారు. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన తొలిసారిగా దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 17వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కథ ఎమోషనల్ లవ్ ట్రయాంగిల్ గా సాగుతుంది.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ నేపథ్యంలో సిద్దు జొన్నలగడ్డ చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నాడు. అదే సమయంలో కొన్ని కామెంట్స్ చేసి వివాదాలకు తెర లేపుతున్నాడు. లేటెస్ట్ గా సినిమా ఇంటర్వెల్ పై కూడా బాంబు పేల్చాడు. ప్రతి సినిమా సెకండ్ హాఫ్‌ లో డిప్ ఉంటుందని పేర్కొన్నాడు. సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా మొద‌లైనా, ఇంటర్వెల్ సమయానికి హై రేంజ్ కు వెళ్తుందని పేర్కొన్నాడు.

అప్పుడే ఇంటర్వెల్ పడుతుందని వివరించాడు. ఇక సెకండాఫ్ స్టార్టింగ్ లో డిప్ అవుతుంద‌ని, ఆ త‌ర్వాత‌ హై రేంజ్ కు వెళుతుందని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇలా ప్రతి సినిమా సెకండ్ హాఫ్ లో స్టార్టింగ్‌ డిప్ కావడానికి ఇంట‌ర్వెల్‌ కాన్సెప్ట్ అని వెల్లడించాడు. ఆ ఇంటర్వెల్ సమయంలో మనోళ్లు పాప్ కార్న్‌ అమ్ముకుంటార‌న్నారు.ఈ పాప్ కార్న్ పంచాయితీ కార‌ణంగా సెకండాఫ్ డిప్ అవుతుంద‌ని వివ‌రించారు. కానీ హాలీవుడ్ సినిమాల్లో ఇంటర్వెల్ అస్సలు ఉండదని తెలిపాడు. ఇక సెకండాఫ్ లో డిప్ ఎక్క‌డ అయిందో, దాన్ని గుర్తించి...క్లైమ్యాక్స్ లో సినిమాను లేపాల‌న్నాడు. లేక‌పోతే సినిమా పోతుంద‌ని ప‌రోక్షంగా చెప్పాడు. క్లిక్





Next Story