- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Siddharth: వాళ్లు నన్ను ఎంతో నమ్మారు.. స్టేజ్‌పైనే కంటతడి పెట్టుకున్న హీరో
సిద్ధార్థ్ (Siddharth) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘3 BHK’.

దిశ, సినిమా: సిద్ధార్థ్ (Siddharth) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘3 BHK’. శ్రీ గణేష్ (Shri Ganesh) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో శరత్‌కుమార్, దేవయాని, యోగి బాబు, మీటా రఘునాథ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, సాంగ్స్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా చెన్నైలో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం. ఈ సందర్భంగా.. హీరో సిద్ధార్థ్ తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్నాడు.
‘ఇది నా 40వ మూవీ. ఇందులో నా తల్లిదండ్రులు కూడా భాగమయ్యారు. నటుడిగా నా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా తల్లిదండ్రులు నాకు ఎంతో సపోర్ట్‌గా ఉన్నారు. వాళ్లు నన్ను ఎంతో నమ్మి.. ప్రతి క్షణం నాకు సపోర్ట్‌గా నిలిచారు. నా 40వ చిత్రంగా తెరకెక్కిన ‘3 BHK’ మూవీ గురించి వారికి చెప్పినప్పుడు ఎంతో సంతోషించారు.. గర్వపడ్డారు. మా నాన్న ముఖంలో, మాటల్లో చెప్పలేనంత ఆనందం. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు ఎంతో అద్భుతంగా చేశారు. వారి నటనను చూసి భావోద్వేగానికి గురయ్యా’ అంటూ స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నాడు.






