- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Siddharth: అలాంటి వ్యాధి బారిన పడిన సిద్ధార్థ్.. చాలా ఇబ్బందులకు గురయ్యానంటూ షాకింగ్ కామెంట్స్
హీరో సిద్ధార్థ్(Siddharth) ‘బాయ్స్’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

దిశ, సినిమా: హీరో సిద్ధార్థ్(Siddharth) ‘బాయ్స్’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే వద్దంటానా వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. తెలుగు, హిందీ, తమిళ ఇండస్ట్రీలో నటించిన ఆయన ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. 2023లో ‘చిన్నా’ మూవీతో ఘన విజయాన్ని అందుకోవడంతో పాటు అవార్డులు కూడా పొందారు. ఇక గత ఏడాది మిస్ యు, ఇండియన్-2 సినిమాలతో వచ్చి హిట్స్ సాధించలేకపోయారు.
ప్రస్తుతం ‘త్రీ బీ హెచ్‌కే’(3 BHK)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘చాలామంది సినీ సెలబ్రిటీలు స్టార్ డమ్ కోసం ఆరాటపడతారు. నేను కూడా అలాగే చేశా.. కానీ స్టార్ డమ్ వచ్చాక నా అభిమానుల వల్లే నేను ఓ వ్యాధి బారిన పడ్డాను. వైద్యులను సంప్రదిస్తే నాకు పోస్ట్ ట్రామేటిక్ స్ట్రెస్ అనే వ్యాధి వచ్చినట్లు చెప్పారు. స్టార్ డమ్ కోసం కష్టపడి.. అది వచ్చాక చాలా ఇబ్బందులకు గురయ్యాను. అయితే నా అభిమానులు నాతో మాట్లాడటానికి ఆసక్తి చూపించారు.
కానీ నాకు అప్పుడు చాలా టెన్షన్ అయింది. అయితే పోస్ట్ ట్రామేటిక్స్ ట్రస్ట్ వ్యాధి నుంచి కోలుకోవడానికి ఏకంగా 8 సంవత్సరాలు పట్టింది. అలోపే అంతా మారిపోయింది. అయినప్పటికీ నాకు మంచి ఆదరణ లభించింది. అభిమానుల వల్ల ఫేమ్ కూడా వచ్చింది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సిద్దు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక సిద్ధార్థ్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆయన హీరోయిన్ అదితి రావు హైదరిని ప్రేమించి సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొద్ది కాలం పాటు ప్రేమించుకున్న వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం. ప్రస్తుతం సిద్ధార్థ్, అదితి వెకేషన్స్‌కు వెళ్తూనే సినిమాల్లోనూ నటిస్తున్నారు.






