- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Prabhas: డార్లింగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ప్రభాస్ పెళ్లిపై పెద్దమ్మ కీలక వ్యాఖ్యలు వైరల్
డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్. ప్రభాస్ పెళ్లిపై ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంటుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: డార్లింగ్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు గుడ్‌న్యూస్. ప్రభాస్ పెళ్లిపై ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంటుంది. ప్రభాస్ ఆ హీరోయిన్‌తో పెళ్లి అట.. ఈ హీరోయిన్‌తో పెళ్లి అట.. అంటూ రకరకాల గాసిప్స్ నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. దీంతో ఆలాంటి వార్తలకు చెక్ పెట్టేలా.. అభిమానాలకు ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి (Shyamala Devi) తీపికబురు అందించారు. తాజాగా ఆమె ప్రభాస్ పెళ్లి టాపిక్‌పై మీడియాతో మాట్లాడుతూ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్‌కు తప్పకుండా పెళ్లి చేయాలని అనుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఈ ఏడాదైనా కావొచ్చు లేదంటే వచ్చే ఏడాది అయిన జరగవచ్చని అన్నారు.
శివుడి అనుగ్రహం ఎప్పుడుంటే, అప్పుడు ప్రభాస్ పెళ్లి అవుతుందన్నారు. ప్రభాస్ పెళ్లి గురించే అందరం ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. త్వరలో శివుడి ఆజ్ఞ వచ్చి, ఆయన పెళ్లి కచ్చితంగా జరుగుతుందని ఆశిస్తున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, శ్రావణమాసం సందర్భంగా ద్రాక్షారామంలోని భీమలింగేశ్వర స్వామి ఆలయాన్ని శ్యామలా దేవి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సందర్శన పూర్తి అయిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది.






