ఇద్దరు పిల్లలు ఉన్నా.. మూడో మొగుడు కావాలంటా.. హీరోయిన్‌పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

by Sujitha Rachapalli |   (  Updated:2026-01-21 12:42:01  IST  )

శ్వేతా తివారీ.. నటనతో మాత్రమే కాదు వివాదాలు, గ్లామర్‌ షోతో ఎప్పుడూ వార్తల్లో ఉండే నటి. హిందీ టెలివిజన్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది ఈ 40 ఏళ్ల నటి.

ఇద్దరు పిల్లలు ఉన్నా.. మూడో మొగుడు కావాలంటా.. హీరోయిన్‌పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా : శ్వేతా తివారీ.. నటనతో మాత్రమే కాదు వివాదాలు, గ్లామర్‌ షోతో ఎప్పుడూ వార్తల్లో ఉండే నటి. హిందీ టెలివిజన్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన ఈ 40 ఏళ్ల నటి.. ఇద్దరు పిల్లలకు తల్లి. కానీ ఇప్పటికీ గ్లామర్ షోతో సోషల్ మీడియాను ఊపేస్తుంది. ప్రస్తుతం మూడో పెళ్లి చేసుకోబోతుందనే రూమర్స్‌తో వైరల్ అయిపోయింది. ముందుగా 1998లో 18ఏళ్ల వయసులో భోజ్‌పురి నటుడు రాజా చౌదరిని లవ్ మ్యారేజ్ చేసుకున్న ఆమె.. హీరోయిన్ పలక్ తివారీ పుట్టిన తర్వాత విడాకులు తీసుకుంది. మళ్లీ 2013లో నటుడు అభినవ్ కోహ్లీని పెళ్లి చేసుకుని.. రియాన్ష్‌కు జన్మనిచ్చింది. 2019లో గొడవలతో అతనితో కూడా విడిపోయింది. ఇక ఇప్పుడు హిందీ బిగ్ బాస్ 13 కంటెస్టెంట్, నటుడు విశాల్ ఆదిత్య సింగ్‌తో ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరిలో మ్యారేజ్ ఉంటుందని.. పిల్లలే ఈ వివాహతంతుకు పెద్దలుగా మారుతానే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు.

Next Story