- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NTRNeel మూవీపై బిగ్ అప్‌డేట్.. స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులు వెయ్యనున్న స్టార్ హీరోయిన్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) గతేడాది ‘దేవర’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు.

దిశ, సినిమా: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) గతేడాది ‘దేవర’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు. ప్రజెంట్ బాలీవుడ్ ‘వార్-2’తో పాటు, ‘దేవర-2’తో కూడా బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాలతో పాటు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashant Neel) దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎపిక్ మూవీకి గ్రీల్ సిగ్నల్ ఇచ్చాడు ఎన్టీఆర్. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా ప్రజెంట్ ‘NTR NEEL’ అనే వర్కింగ్ టైటిల్‌తో స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ ప్రెస్టీజియస్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవల హైదరాబాద్(Hyderabad)లోని రామోజీ ఫిల్మ్ సిటీలో స్టార్ట్ చేయ్యగా.. రీసెంట్‌గా ఎన్టీఆర్ కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం.
ఇక అనౌన్స్‌మెంట్ నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. రోజు రోజుకు ఈ మూవీ క్రేజ్ మరింత పెరిగిపోతుంది. అంతే కాకుండా.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయిక వెండితెరపై ఎలాంటి మ్యాజిక్‌ను క్రియేట్ చేస్తుందోనని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. NTRNeel మూవీకి సంబంధించి లేటెస్ట్‌గా మరో ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతోంది. అందుతున్న సమాచారం మేరకు.. స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ (Shruti Haasan) ఈ చిత్ర తారాగణంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుందని తెలుస్తుండగా.. శ్రుతి హాసన్ ఈ చిత్రంలోని ఒక ప్రత్యేక పాటలో నటించనుందట. అలాగే NTRనీల్ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. అయితే.. వీటిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
- Jr NTR recently joined the set of #NTRNeel
— Movie Tamil (@MovieTamil4) April 25, 2025
- #ShrutiHaasan is allegedly on board the cast of the film. While #RukminiVasanth is the female lead of this film.
- ShrutiHaasan will be performing in a special song of the movie.
- It is further being reported that while the… pic.twitter.com/pTfOLKVL6W






