- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Shruti Haasan: నువ్వు కమల్ హాసన్ కూతురు కాదు అన్నారు.. శృతి హాసన్ ఎమోషనల్ కామెంట్స్
స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన మల్టీ టాలెంట్‌తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది శృతి హాసన్

దిశ, సినిమా: స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన మల్టీ టాలెంట్‌తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది శృతి హాసన్ (Shruti Haasan). ప్రస్తుతం ఈ అమ్మడు భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ‘కూలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మల్డీ స్టారర్‌గా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రస్తుతం మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్.. కెరీర్ స్టార్టింగ్‌లో తను ఎదుర్కొన్న కొన్ని సంఘటనల గురించి తెలిపింది.
‘నా మొదటి సినిమా తర్వాత నేను ఎన్నో అనుమానాలు ఎదుర్కొన్నాను. అందరూ అసలు నువ్వు మేము ఊహించిన కమల్ హాసన్ కూతురు కాదని అన్నారు. నటన, హిట్ పరంగా చులకనగా మాట్లాడారు. అప్పుడు నాకు చాలా బాధఅనిపించేది. అలాగే నేను ఇంతేనా అనుకుని చాలా చాలా భయపడ్డాను. అయితే.. గబ్బర్ సింగ్ కోసం నన్ను అప్రోచ్ అయినప్పుడు.. అందరూ శృతి హాసన్‌ను తీసుకోవద్దని అన్నారు. కానీ హరీష్ శంకర్ నన్ను తీసుకోవడానికి పోరాడాడు. అదే నా జీవితాన్ని మార్చివేసింది’ అని తెలిపింది. లింక్






