‘నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను’ అంటూ అల్లు అర్జున్ బ్యూటీ పోస్ట్..

by Kodari Anjali |

హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

‘నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను’ అంటూ అల్లు అర్జున్ బ్యూటీ పోస్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ పవర్‌‌స్టార్ పవన్ కల్యాన్, ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. శృతి హాసన్ నటించిన సినిమాలు చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నవేనని చెప్పుకోవచ్చు. అనగనగా ఓ ధీరుడు మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ వరుస అవకాశాలు అందుకుని.. వరుస హిట్లు కొట్టింది. ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ సంపాదించుకుంది.

అప్పట్లో శృతి హాసన్ ఓ మూవీ చేస్తుందంటే పక్కా హిట్ కొడుతుందనే భావన ప్రేక్షకుల్లో ఉండేది. తమ సినిమాలో పెట్టుకునేందుకు దర్శక, నిర్మాతలు కూడా ముందుకొచ్చేవారు. తన ప్రతిభతో ఈ హీరోయిన్ కోట్ల మంది ఫ్యాన్స్‌ను కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం శృతి హాసన్‌కు అవకాశాలు తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం ఈ నటి తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి కూలి చిత్రంలో నటిస్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఆగస్టు 14 వ తారీకున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తాజాగా సోషల్ మీడియాలో తన నాన్న కమల్ హాసన్ గురించి ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ ఎల్లప్పుడూ నాకు వెలుగు, బలం.. నిరంతరం నా నవ్వుకు కారణం మీరే. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అప్పా’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం శృతి హాసన్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story