ఆ సమయంలో చాలా బాధపడ్డానంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసిన శృతి హాసన్..

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) కూతురు శృతి హాసన్(Shruti Haasan) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

ఆ సమయంలో చాలా బాధపడ్డానంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసిన శృతి హాసన్..
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) కూతురు శృతి హాసన్(Shruti Haasan) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ అమ్మడు తెలుగు, తమిళ, హిందీ స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ ఫేమ్ దక్కించుకుంది. చివరగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో రాబోతున్న ‘కూలీ’ చిత్రంలో శృతి కీలక పాత్రలో నటిస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నాగార్జున, సత్యరాజ్, ఉపేంద్ర ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇక ఈ చిత్రంతో పాటు శృతి హాసన్ దళపతి విజయం ‘జననాయగన్’ (Jananayagan)లోనూ కీలక పాత్రలో నటిస్తోంది.

అలాగే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమాలో ఐటమ్ సాంగ్ చేయనున్నట్లు టాక్. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్ రిలేషన్‌షిప్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘చాలామంది ఎన్నో నంబర్ బాయ్‌ఫ్రెండ్ అని అంటారు. అసలు విషయం తెలియక.. ఏవేవో అనేస్తారు. మీకు అర్ధం కాదు. అది నాకు నంబర్ కాదు.. నేను ఎన్నోసార్లు రిలేషన్‌షిప్‌లో ఓడిపోయాను. నేను మనిషిను కదా.. చాలా బాధపడ్డాను. కానీ ఎవరినీ బ్లేమ్ చేయలేదు. వారిలా నేను మారాలని అనుకోలేదు ఎందుకంటే అలా చేయడం సాథ్యం కాదు. అప్పుడే అనుకున్నాను రిలేషన్‌షిప్ కోసం కాకుండా నా కోసం నేను నిలబడ్డాను. అలా మరొకరికి దగ్గరయ్యే ముందు మీ తల్లిదండ్రులకు క్లోజ్ అవ్వండి’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story