- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shruti Haasan: నచ్చిన రంగులో మెరిసిన క్యూట్ బ్యూటీ
Shruti Haasan: తనకు ఎంతో నచ్చిన బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో ఆకట్టుకుంటున్న శృతిహాసన్.

దిశ, వెబ్ డెస్క్ : శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ సినిమాల ద్వారా కెరీర్ను ప్రారంభించిన ఈమెకు మొదట్లో చాలా అపజయాలు దక్కాయి. దాంతో అనేకమంది ఈ నటి ఐరన్ లెగ్ అని, ఈ బ్యూటీతో సినిమా చేస్తే అది ఆడదు అనే పేరు వచ్చింది. అలాంటి సమయంలోనే శృతి హాసన్, పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన గబ్బర్ సింగ్ చిత్రంలో హీరోయిన్గా నటించి మంచి విజయాన్ని అందుకుంది.
ఈ చిత్రంతో ఈమె కెరీర్ టర్న్ అయింది. ఆ తర్వాత కూడా ఈ హీరోయిన్ నటించిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో ఐరన్ లెగ్ అన్న వారంతా శృతిని గోల్డెన్ లెగ్ అని పిలవడం మొదలుపెట్టారు. చాలా కాలం పాటు ఈ నటి తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో టాప్ హీరోయిన్గా కెరీర్ను కొనసాగించింది. ఈ మధ్యకాలంలో ఈమెకు అవకాశాలు చాలా వరకు తగ్గాయి. కొంతకాలం క్రితం ఈ బ్యూటీ వరుసగా వాల్తేరు వీరయ్య, సలార్ పార్ట్ 1 చిత్రాలతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాలను సొంతం చేసుకుంది.
సినిమాల్లో వీలు చిక్కినప్పుడల్లా అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే రీతిలో రెచ్చిపోతుంది. తాజాగా ఈ హీరోయిన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో ఈమె తనకు ఎంతో నచ్చిన బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుంది. శృతిహాసన్ బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితమయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.






