Shriya Saran: ఫుట్ ట్యాపింగ్ నెంబర్‌గా ‘కనకం’.. మెస్మరైజ్ చేస్తున్న మెట్రో శిరీష్ , శ్రియ శరణ్ డ్యాన్స్

by Chukka Sudharani |

మెట్రో శిరీష్ , శ్రియ శరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నాన్-వయోలెన్స్’.

Shriya Saran: ఫుట్ ట్యాపింగ్ నెంబర్‌గా ‘కనకం’.. మెస్మరైజ్ చేస్తున్న మెట్రో శిరీష్ , శ్రియ శరణ్ డ్యాన్స్
X

దిశ, సినిమా: మెట్రో శిరీష్ , శ్రియ శరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నాన్-వయోలెన్స్’. ఇందులో నుంచి తాజాగా యువన్ శంకర్ రాజా కంపోజ్ చేసిన ‘కనకం’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అదిరిపోయే ఫుట్ ట్యాపింగ్ నెంబర్‌గా ట్యూన్ చేసిన ఈ సాంగ్‌లో యువన్ శంకర్ రాజా, తేజస్విని నందిభట్ల వోకల్స్ కట్టిపడేశాయి. భాష్య శ్రీ అర్థవంతమైన సాహిత్యంతో అలరించారు. మెట్రో శిరీష్ , శ్రియ శరణ్ ఎనర్జిటిక్ మూవ్స్‌తో ఆకట్టుకున్నారు. మొత్తంగా ఈ సాంగ్ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతూ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తుంది. కాగా.. ఆనంద కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే పిక్చర్స్ నిర్మిస్తుంది. ఇందులో బాబీ సింహా, యోగి బాబు, అదితి బాలన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Next Story