అది నేను కాదు.. ఇలా జరగడం బాధగా ఉందంటూ హీరోయిన్ శ్రియ కామెంట్స్

by Chukka Sudharani |

ఇటీవల సెలబ్రిటీల పేర్లతో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి.

అది నేను కాదు.. ఇలా జరగడం బాధగా ఉందంటూ హీరోయిన్ శ్రియ కామెంట్స్
X

దిశ, సినిమా: ఇటీవల సెలబ్రిటీల పేర్లతో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. రీసెంట్‌గా నటి అదితి రావు హైదరి తన పేరుతో నకిలీ వాట్సప్ క్రియేట్ చేసి ఒక వ్యక్తి ఫొటోగ్రాఫర్లను మోసం చేస్తున్నట్లు, జాగ్రత్తగా ఉండాలని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ ఈ నకిలీ వాట్సప్ బారినపడ్డాను. ఈ విషయాన్ని తెలుపుతూ తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘ఈ వాట్సప్ ఎవరిదో నాకు తెలియదు. దయచేసి ఇలాంటివారితో చాల్ చేసి మీ విలువైన సమయాన్ని వృథా చేసుకోకండి. ఇలా జరగడం నాకు బాధగా ఉంది. ఇది నేను కాదు.. ఈ నంబర్ నాది కాదు. దురదృష్ణం ఏంటంటే.. ఈ వ్యక్తి నా సన్నిహితులకు, నేను కలిసి వర్క్ చేయనున్న వారికి మెసేజ్ చేస్తున్నాడు. అందరూ జాగ్రత్తగా ఉండండి’ అంటూ పోస్ట్ పెట్టింది శ్రియ.

Next Story