SIFF: సత్తా చాటిన తెలుగు దర్శకులు

by Gantepaka Srikanth |

శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెలుగు రచయితలు సత్తా చాటారు. రచయిత, దర్శకుడు సత్యకాశీ భార్గవ, యువ దర్శకుడు కృష్ణ ఎస్. రామ అవార్డులు సొంతం చేసుకున్నారు.

SIFF: సత్తా చాటిన తెలుగు దర్శకులు
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెలుగు రచయితలు సత్తా చాటారు. రచయిత, దర్శకుడు సత్యకాశీ భార్గవ, యువ దర్శకుడు కృష్ణ ఎస్. రామ అవార్డులు సొంతం చేసుకున్నారు. ఈ సందర్బంగా సత్యకాశీ భార్గవ మాట్లాడుతూ.. నాలుగు అవార్డుడు రావడం చాలా సంతోషాన్నిస్తోందని అన్నారు. ఇది మన తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణమని తెలిపారు. రామ అయోధ్య ఫిల్మ్ డైరెక్టర్ కృష్ణ మాట్లాడుతూ.. మొదటి చిత్రానికే ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డు రావడం చాలా ఆనందంగా, గొప్పగా భావిస్తున్నానని చెప్పారు. రామ అయోధ్య ఫిల్మ్ 2024 ఏప్రిల్ 17న ఆహా తెలుగు OTTలో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నది. దూరదర్శన్ నేషనల్ టీవీలో 2024లో రిలీజైన ‘శ్రీమాన్ రామ’ ఇప్పటికీ కొనసాగుతూ నెంబర్ -1 టీవీ షోగా రికార్డు సృష్టించింది.

అవార్డ్స్ :

1. బెస్ట్ డైరెక్టర్ (యానిమేషన్)-సత్యకాశీ భార్గవ (శ్రీమాన్ రామ )

2. బెస్ట్ కార్టూన్ యానిమేషన్ ఫిల్మ్ - శ్రీమాన్ రామ

3. బెస్ట్ మైథలాజికల్ డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్ - కృష్ణ ఎస్.రామ (రామ అయోధ్య)

4. బెస్ట్ కల్చరల్ స్టోరీ కాన్సెప్ట్ - సత్యకాశీ భార్గవ (రామ అయోధ్య)





Next Story