Shri Krishna: ప్రపంచస్థాయి టెక్నీషియన్లతో తెరకెక్కుతున్న మరో వండర్‌ఫుల్ చిత్రం.. టైటిల్ రివీల్

by Chukka Sudharani |

అభయ్ చరణ్ ఫౌండేషన్, శ్రీజీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఒక చారిత్రక మహాకావ్యాన్ని నిర్మిస్తున్నారు.

Shri Krishna: ప్రపంచస్థాయి టెక్నీషియన్లతో తెరకెక్కుతున్న మరో వండర్‌ఫుల్ చిత్రం.. టైటిల్ రివీల్
X

దిశ, సినిమా: అభయ్ చరణ్ ఫౌండేషన్, శ్రీజీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఒక చారిత్రక మహాకావ్యాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టైటిల్‌ను తాజాగా అనౌన్స్ చేశారు. అనిల్ వ్యాస్ నిర్వహణలో.. ముకుంద్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలిపారు. ఇది 11-12వ శతాబ్దాల నాటి ‘మహోబా’ సాంస్కృతిక వైభవాన్ని, అలాగే భగవాన్ శ్రీ కృష్ణుడి దివ్యత్వాన్ని, ధీరత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రభావాన్ని చుపించాబోతుంది. చలన చిత్ర పరిశ్రమలో తొలిసారిగా శ్రీ కృష్ణుడిని ఒక యుద్ధవీరుడి పాత్రలో చూపించబోయే సినిమా ఇది. ‘శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా’ ఒక పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందబోతున్నట్లు తెలిపారు మేకర్స్. ప్రపంచస్థాయి టెక్నీషియన్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రం, చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మికతను కలగలుపుతుంది. నటీనటులు, సాంకేతిక బృందం, ఇతర వివరాలు త్వరలో ప్రకటించబడతాయని తెలిపారు.

Next Story