- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జోరు పెంచిన శ్రీ విష్ణు.. చేతిలో ఏకంగా నాలుగు సినిమాలు
శ్రీ విష్ణు 'సన్నీ సంజయ్' మూవీతో పాటు రామ్ అబ్బరాజు దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. అలాగే భాను భోగవరపు, పవన్ బసంశెట్టిలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన జోష్‌తో కెరీర్‌ను ముందుకు సాగిస్తున్న యువ నటుల్లో శ్రీ విష్ణు ఒకరు. ఈయన ఈ సంవత్సరం కేవలం వారం గ్యాప్‌లోనే విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ అనే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలు కూడా మంచి ప్రేక్షకాదరణ పొందాయి. ఇక ప్రస్తుతం ఈయన చేతిలో ఏకంగా నాలుగు చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో సన్నీ సంజయ్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఆల్మోస్ట్ సగానికి పైగా పూర్తి అయినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాతో పాటు ప్రస్తుతం రామ్ అబ్బరాజు దర్శకత్వంలో మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ రెండు సినిమాలను ఈ ఏడాది రిలీజ్ చేసే ప్లాన్‌లో శ్రీ విష్ణు ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీ విష్ణు ప్రస్తుతం భాను భోగవరపు, పవన్ బసంశెట్టిలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు, అన్ని సానుకూలంగా జరిగితే ఈ ఇద్దరితో కూడా ఈ ఏడాది సినిమాలు స్టార్ట్ చేసే ఆలోచనలో ఈ యువ హీరో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా వరుస సినిమా షూటింగ్స్‌లో పాల్గొనడం మాత్రమే కాకుండా అనేక సినిమాలను ఓకే చేస్తూ శ్రీ విష్ణు ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాడు.






