- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీ విష్ణు నెక్స్ట్ మూవీ టైటిల్ పిక్స్
గాయపడ్డ సింహం సీక్వెల్‌లో శ్రీ విష్ణు నటించనున్నట్లు సమాచారం. ఈ సీక్వెల్‌కు పోరాట సింహం అనే టైటిల్‌ను ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ టాలెంటెడ్ టాలీవుడ్ నటుడు శ్రీ విష్ణు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ నటుడు కెరీర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సినిమాల్లో హీరోగా నటిస్తూ మంచి జోష్‌లో కెరీర్‌ను ముందుకు సాగిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ నటుడు తరుణ్ భాస్కర్ హీరోగా రూపొందిన గాయపడ్డ సింహం చిత్రంలో కీలక పాత్రలో నటించాడు. ఇప్పటికే ఈ విషయాన్ని మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ట్రైలర్‌లో కూడా శ్రీ విష్ణు కనిపించాడు. ఈ చిత్రంలో ఆయన ఎక్స్టెండెడ్ కామియో పాత్రలో కనిపించబోతున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది.
ఈ సినిమాలో ఆయన తక్కువ సమయం మాత్రమే కనిపించినా, ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోబోతున్నట్లు సమాచారం. ఇకపోతే గాయపడ్డ సింహం చిత్రానికి సీక్వెల్‌గా మరో మూవీని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సీక్వెల్‌లో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో కనిపించనున్నారని టాక్. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీక్వెల్‌కు 'పోరాట సింహం' అనే టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని, దీనిని సినిమా చివర్లో అనౌన్స్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రంపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.






