- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రీన్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో కొంటె చూపులతో కవ్విస్తున్న శ్రద్ధ శ్రీనాథ్
‘జెర్సీ’ బ్యూటీ హాట్ ట్రీట్.. శ్రద్ధా శ్రీనాథ్ స్టైలిష్ స్టిల్స్ అదిరిపోయాయి.

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటి శ్రద్ధా శ్రీనాథ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2015లో విడుదలైన మలయాళ చిత్రం ‘కోహినూర్’ ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ, ఆ తర్వాత 2016లో వచ్చిన కన్నడ చిత్రం ‘యూ టర్న్’లో తన అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో నటనకు గాను ఆమెకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా లభించింది.
ఇక 2018లో విడుదలైన ‘జెర్సీ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రద్ధా, తొలి సినిమాతోనే తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. సాధారణంగా యంగ్ హీరోయిన్లు కెరీర్ ప్రారంభంలో తల్లి పాత్రలకు దూరంగా ఉంటారు. కానీ శ్రద్ధా మాత్రం ‘జెర్సీ’లో తల్లి పాత్రలో నటించి, తన సహజమైన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.
కేవలం కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, వైవిధ్యమైన పాత్రలతో నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలనే లక్ష్యంతో శ్రద్ధా ఇప్పటివరకు ఎన్నో విభిన్న పాత్రలు పోషించింది. అయితే నటిగా మంచి గుర్తింపు వచ్చినప్పటికీ, భారీ స్థాయి కమర్షియల్ విజయాలు మాత్రం ఆమెను ఎక్కువగా వరించలేదు.
సినిమాలతో తరచూ ప్రేక్షకులను పలకరించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం శ్రద్ధా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ, అప్పుడప్పుడు తనకు సంబంధించిన స్టైలిష్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లూ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో అదిరిపోయే ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.
బెడ్‌పై కూర్చొని, అలాగే కుర్చీలో స్టైలిష్‌గా పోజులు ఇస్తూ కిల్లింగ్ లుక్స్‌తో మెస్మరైజ్ చేసింది. చెవులకు అందమైన ఇయర్‌రింగ్స్ ధరించి, కురులను వెనక్కి వదిలేసి మరింత ఆకర్షణీయంగా కనిపించింది. ముఖ్యంగా ఆమె స్టైలిష్ లుక్స్‌తో పాటు గ్లామర్ టచ్ ఈ ఫోటోలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Photos Courtesy: Instagram






