- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shraddha Srinath: ఏడాది కూడా ఇండస్ట్రీలో ఉండలేదు అన్నారు.. హాట్ టాపిక్‌గా యంగ్ హీరోయిన్ కామెంట్స్
‘జెర్సీ’ సినిమాతో టాలీవుడ్ (Tollywood) ఎంట్రీ ఇచ్చింది కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్

దిశ, సినిమా: ‘జెర్సీ’ సినిమాతో టాలీవుడ్ (Tollywood) ఎంట్రీ ఇచ్చింది కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath). మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ప్రజెంట్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లో రాణిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ‘డాకు మహారాజ్’ (Daku Maharaj) సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీ విజయం అందుకోవడంతో సక్సెస్ ఎంజాయ్ చేస్తు్న్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కమర్షియల్ (Commercial) హీరోయిన్‌గా కంటే.. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే తన లక్ష్యం అంటుంది శ్రద్ధా.
‘డిఫరెంట్ రోల్స్ (Different roles) చేసినప్పుడే కదా.. నటిగా మనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. అందులో పాత్రల ఎంపికలో కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాను. అలాగే ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉండే టైప్ కాదు.. ఒకటి రెండు చేసిన కథలో డెప్త్ ఉండాలి అనుకుంటాను. తెలుగులో నా మొదటి సినిమా ‘జెర్సీ’ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ‘డాకు మహారాజ్’తో టాలీవుడ్‌లో నా జర్నీ స్పీడందుకుంటుందని భావిస్తున్నా. నాకు ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్స్ (Godfathers) లేరు. ప్రతి సినిమా ఒక పాఠమే. జెర్సీ విజయం తర్వాత కొన్ని ఆఫర్స్ (Offers) వచ్చాయి. అయితే.. సినిమాహిట్టయినా, ఫ్లాప్ అయినా ఒకేలా రిసీవ్ చేసుకుంటాను. నేను ఎంత నిజాయతీగా పనిచేశానన్నదే నాకు ముఖ్యం. రిజల్ట్ (Result) గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అలాగే నాపై వచ్చే నెగిటివిటీ (Negativity)ని కూడా అంతగా పట్టించుకోను. అసలు నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఏడాది కూడా చిత్ర పరిశ్రమలో ఉండలేదు అని మా బంధువులు అన్నారు. కానీ ఈ రోజు ఈ పోజిషన్ (Position)లో ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఈ శ్రద్ధా శ్రీనాథ్ వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ (Hot topic)గా వైరల్ అవుతున్నాయి.






